అంగన్వాడీల హక్కుల సాధన కోసం ఉద్యమిద్దాం
1 min readపల్లెవెలుగు, వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా అంగన్వాడి వర్కర్ యూనియన్ మొట్టమొదటి మహాసభ నరసింహయ్య భవనంలో కామ్రేడ్ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు అమ్మ మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ కు నిధులు తగ్గిస్తూ పని భారాన్ని పెంచుతుంది అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు ఆడి వర్కర్స్ కు నేటికీ 2017 వ సంవత్సరం నుండి టీఏ బిల్లులు రాలేదని అలాగే కూరగాయల బిల్లులు సరుకుల రవాణా బిల్లులు పెంచాలన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంగన్వాడి వర్కర్స్ కు పూర్తిస్థాయిలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు అంగన్వాడి వర్కర్స్ పై రాజకీయ వేధింపులు తగ్గించాలని పని అంగన్వాడి వర్కులపై పెరిగిన పనిభారానికి అనుగుణంగా వేతనాలు పెంచి ఇవ్వాలన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్తూ గర్భవతులు బాలింతలు చిన్నపిల్లలకు నిరంతరం సేవలు చేస్తూ ఇటువంటి అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు సూపర్వైజర్ టెస్టులు పెట్టి రోస్టరు సీనియార్టీ లిస్టు కి విడుదల చేయకుండా అంగన్వాడి వర్కర్స్ ను మోసం చేసి ఉద్యోగాలు నిలుపుదల చేసిందన్నారు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు తాత్కాలికంగా సూపర్వైజర్లను రద్దుచేసి సీనియార్టీ అంగన్వాడి వర్కర్స్ తో సూపర్వైజర్ పోస్టులు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు యేసురత్నం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శోభారాణి కోశాధికారి నిర్మలమ్మ జిల్లా నాయకురాల్లో నాగరాణి మంజుల శివలక్ష్మి నాగలక్ష్మి రాజ్యలక్ష్మి తదితర నాయకులు మాట్లాడారు ఈ మహాసభలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ 150 మంది పాల్గొన్నారు.