అమరవీరుల ఆశయ సాధనకై ఉద్యమిద్దాం
1 min readపల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి విప్లవకారుడు ఉద్యమించాలని సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అమరవీరుల వార్షికోత్సవాలు మంగళవారం స్థానిక తర్తురు గ్రామంలో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అమరవీరుల సభకు ఇఫ్టు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. అరుణ్ కుమార్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష,కార్యదర్శులువై. ఆశీర్వాదం, కె. అరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల వారి హక్కుల కొరకు గిరిజనుల ఆదివాసుల హక్కుల కొరకు ప్రతిఘటన పోరాటాల ద్వారా పోరాడి విప్లవోద్యమంలో అమరులైన చంద్ర పుల్లారెడ్డి , తరిమెల నాగిరెడ్డి, నీలం రామచంద్రయ్య, రామనర్సయ్య, పెద్దింటి గోకారి,కామ్రేడ్ తిక్కన్న లాంటి అమరుల ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారని వారి ఆశయ సాధనకై మనం కృషి చేయాలన్నారు. నేటి యువత వాళ్ళని ఆదర్శం గా తీసుకుని వారి ఆశయాలు కొనసాగించాలని అలాగే దేశాన్ని సామ్రాజ్యవాదులు కార్పొరేషన్ సంస్థల నుండి ఎదురవుతున్న కబ్జా ప్రమాదం నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు. భారతదేశంలో నూతన ప్రజాతంత్ర విప్లవాన్ని కోరుకునే విప్లవకారులు విప్లవ సంస్థలు విప్లవశక్తులు మేధావులు కమ్యూనిస్టు విప్లవకారులు పోరాటాలకు అండదండలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాషా, ఇఫ్ట్ సీనియర్ నాయకులు రంగన్న, ఇఫ్ట్ జిల్లా నాయకులు కె. మద్దిలేటి, వీపనగండ్ల హమాలీ నాయకులు మద్దిలేటి, నాయకులు నాగరాజు, మద్దిలేటి, ఆంజనేయులు,కురువ మధు, శేషన్న తదితరులు పాల్గొన్నారు.