రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమిద్దాం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జెండా,అజెండా పక్కనబెట్టి, రాజకీయాలకతీతంగా అన్నిపార్టీలు ఐక్యంగా ఉద్యమించి మన ప్రాజెక్టులను సాధించుకుందామని ఏ ఐ ఎఫ్ టీ యు పిలుపునిచ్చింది.రాయలసీమ లోని కర్నూల్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కరువు, వలసలు అగాలంటే అందరం కలిసి ఇక్యంగా ఉద్యమించాలని కోరుతూూ, పత్తికొండ మండల కేంద్రంలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య(A I F T U) మరియు భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ వలస కార్మికుల చైతన్య యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా స్తంభాల కూడలిి ఈ సి. లో డా. బి , కు RCC పొలిటికల్ ఆర్గనైజర్ రాజన్న అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ, రైతుల పరిస్థితి రోజు రోజుకుు దిగజారి పోతోంది అని అన్నారు. ఇప్పటికి ఇంకా మన ప్రాంతంలో కరువు, వలసలు ఉన్నాయని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అందరం కలిసి ఉద్యమించాల్సిన అవసరంం ఏర్పడిందని అన్నారు. మార్కెట్లో కార్పొరేట్ సంస్థల ప్రభావం పెరిగిపోతోందని, దీనివల్ల రైతులకు ధరలలో హెచ్చు తగ్గులు ఏర్పడి, కనీస మద్దతు ధర రాక రైతులు ఆత్మహత్యలే శరణ్యంగాా భావిస్తున్నారని ఆందోళన చెందారు. పూర్తిగాాా వెనుకబడినన పత్తికొండ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు అపద్దపు మాటలు చెపుతు ఇక్కడ ఉన్న రైతులను మోసం చేస్తున్నారు అనిిఅన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగఅవకాశాలు కల్పించాలని కోరారు.AADA కన్వీనర్ ఆదినారాయణ మాట్లాడుతూ.. రాయలసీమ లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి ఒక్కసారి మంచినీళ్లు రాని పరిస్థితి ఉందన్నారు. తల్లితండ్రులతోపాటు పిల్లలు కూడా వలస పోయి బాలకార్మికులుగా మిగిలిపోతున్నారని ఆవేదన చెందారు. ఉపాధి లేక నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది.