NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అరాచక పాలన సాగిస్తున్న జగనాసురుడికి కళ్ళు తెరిపిద్దాం

1 min read

పల్లెవెలుగ వెబ్ కర్నూలు:  తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేశ్ ఆదేశాల మేరకు జగనాసుర చీకటి పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం ఎదుట అరాచక పాలన సాగిస్తున్న జగనాసురుడికి కళ్ళు తెలిపిద్దాం అంటూ కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిజం గెలవాలి అని నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎర్రసాని నాగేశ్వరరావు యాదవ్  పాల్గొనడం జరిగింది.ఈ సంధర్బంగా వారిరువురు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఇప్పటి వరకు నిర్వహించిన మోత మోగిద్దం, న్యాయానికి సంకెళ్ళు, కాంతితో క్రాంతి, మనం చేద్దం జగనాసుర దహనం వంటి కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని అన్నారు.  చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 50 రోజులుగా జైలులో పెట్టడం దారుణమని, ఆయనకు వ్యతిరేకంగా కనీసం ఒక్క ఆధారాన్ని కూడా సి.ఐ.డి అధికారులు సేకరించలేకపోయారని, ఆయన అవినీతికి పాల్పడినట్లు అధారాలు లేవని అన్నారు.  అనేక అవినీతి అక్రమ కేసులలో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం విచారణకు కూడా హాజరు కాకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. నారా చంద్రబాబు గారి అరెస్ట్ వార్తను విని గుండె పగిలి మరణించిన పార్టీ కుటుంభ సభ్యులను శ్రీమతి నారా భువనేశ్వరి గారు వారి కుటుంభ సభ్యులను ఓదారుస్తున్నారని, చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చి అందరికి అండగా నిలుస్తారని ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం నింపుతున్నారని అన్నారు.  శ్రీమతి భువనేశ్వరి గారి కనీటిని చూసి రాష్ట్ర ప్రజలు చలించిపోయి కనీళ్ళు పెట్టుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు సైకో ముఖ్యమంత్రికి ఓటు ద్వారా బుద్ధి చెప్తారని అన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు పోతురాజు రవికుమార్, నంది మధు,  పార్లమెంట్ పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులు కె.ఇ.జగదీశ్ (లీగల్ సెల్), యస్.అబ్బాస్ (తెలుగుయువత), షేక్ ముంతాజ్ (తెలుగు మహిళ) సత్రం రామక్రిష్ణుడు (బి.సి సెల్), పి.హనుమంతరావు చౌదరి (సాంస్క్రుతిక), గున్నా మార్క్, చంద్రకాంత్, రామక్రిష్ణ, రామాంజనేయులు, రాజ్య లక్ష్మి, విజయ కుమారి, మంగమ్మ, స్వర్ణలత, లలితమ్మ, విజేత మొదలగు వారితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author