నియోజకవర్గస్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడలను విజయవంతం చేయండి
1 min readమున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి .
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆడుదాం ఆంధ్ర నందికొట్కూరు నియోజకవర్గస్థాయి క్రీడల సంసిద్ధత సమావేశాన్ని సోమవారం నందికొట్కూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు నియోజక వర్గ పరిధిలోని 6 మండలాల వ్యాయామ ఉపాధ్యాయులతో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డోరతి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ పి.కిశోర్, ఎంపీడీఓ శోభారాణి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామి రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 24 వ తేదీ నుండి 29 వ తేదీ వరకు నందికొట్కూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం లో నిర్వహించబోయే నియోజక వర్గ స్థాయి క్రీడలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా అందరూ ఐకమత్యంగా పనిచేసి విజయవంతం చేయాలని కోరారు.అలాగే నియోజక వర్గ స్థాయి క్రీడలకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, సిద్దార్థ రెడ్డి అభిమానులు మరియు క్రీడా ప్రేమికులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ కిశోర్, ఎంపీడీఓ శోభారాణి మాట్లాడుతూ క్రీడల విజయవంతానికి తమ సంపూర్ణ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అనంతరం నంద్యాల, కర్నూలు జిల్లాల శాప్ కో ఆర్డినేటర్ లు స్వామి దాసు రవి కుమార్, శ్రీనాథ్ పెరుమాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన వ్యాయామ ఉపాద్యాయుల సమావేశంలో క్రీడలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఏ మైదానంలో ఏ క్రీడలు నిర్వహించుకోవాలి, కన్వీనర్ లు,గేమ్స్ ఇంఛార్జి లను ఎవరిని నియమించుకోవాలి అనే అంశంలో ముందస్తు ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఆడుదాం ఆంధ్ర కో-ఆర్డినేటర్ లు వీరన్న,కృష్ణ,వెంకటేశ్వర్లు,శ్రీనివాసులు,రాజశేఖర్, మురళీ నాయక్ ఫిజికల్ డైరెక్టర్ లు పద్మ లత ,జయమ్మ, జేసింత, విజయ కుమారి,అరుణ, స్వరూప,సుమలత, చంద్ర మోహన్, చెన్నమ్మ, ఊర్మిళ ముస్తహీర్,చంద్ర, శ్రీధర్ కుమార్,శివన్న,శ్రీనివాసులు, కౌన్సిలర్ లాలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.