PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలపర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో ఆడుదాం-ఆంధ్ర

1 min read

ముఖ్య అతిథిగా విచ్చేసిన రియాజ్ అలీఖాన్

సొంత నిధులతో పలు క్రీడా ప్రాంగణాలు అభివృద్ధికి కృషి

క్రీడల ద్వారానే యువతకు మెరుగైన ఆరోగ్యం,ఉద్యోగ అవకాశాలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : కలపర్రు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏలూరు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్, 46వ డివిజన్ ఇంచార్జ్, బిజ్ రాక్ వెబ్ సొల్యూషన్  అధినేత  రియాజ్ అలీ ఖాన్ ని ముఖ్యఅతిథిగా  ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లల కబడ్డీ ప్రోగ్రాం నీ రియాజ్ అలీ ఖాన్ చేతుల మీదగా ఆట ప్రారంభించి మొదలుపెట్టడం జరిగినది. ఈ సందర్భంగా రియాజ్ అలీ ఖాన్  స్కూలుకి చేసిన డొనేషన్ గురించి హెడ్మాస్టర్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ వినాయక్  రియాజ్ అలీ ఖాన్  చేసిన సేవా గుణానికి, ఆర్థిక సహాయానికి పలువురు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు. విద్యార్థిని, విద్యార్థులు ప్రశంసించారు. రియాజ్ అలీ ఖాన్  సభను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు వల్లే ఎంతో శారీరకంగా, మానసికంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉండటం జరుగుతుందని. అలాగే క్రీడల తో నేటి యువతకు ఉపయోగాలు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అవన్నీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ప్రవేశ పెట్టిన ఆడుదాం-ఆంధ్ర అలాగే పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన పలు సంక్షేమ పథకాల గురించి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి విద్యార్థులకు చేస్తున్న తినలేని కృషి, పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు లను కొనియాడారు. రియాజ్ అలీ ఖాన్  సొంత నిధులతో  నూతనంగా ఆయన చేపించిన బాస్కెట్బాల్  కోర్టు,  బ్యాట్మెంటన్ కోర్టు, మరియు లాంగ్ జంప్ కోర్టులని రియాజ్ అలీ ఖాన్ ప్రారంభించడం జరిగినది. కార్యక్రమం అనంతరం స్కూల్ సిబ్బంది రియాజ్ అలీ ఖాన్ ని శాలువా కప్పి పూలమాలలు అందించి ఘనంగా సత్కరించారు.

About Author