PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

1 min read

– మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య ఎంపీపీ చీర్ల

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి క్రీడా పోటీలు మండల వ్యాప్తంగా ఈనెల పదవ తేదీ నుండి మొదలు కానున్నాయని ఈ క్రీడా పోటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందువల్ల దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు తెలిపారు, ఈ సందర్భంగా వారు మండల సభా భవనంలో పంచాయితీ కార్యదర్శులకు అలాగే పీఈటీలకు క్రీడా పోటీల గురించి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా మండల వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు సజావుగా జరిగే విధంగా మండల స్థాయి అధికారులు అందరూ కృషి చేయాలని, అదేవిధంగా క్రీడామైదానంలోకి క్రీడాకారులు సమయపాలన పాటించి వచ్చే విధంగా చూడాలని, అలాగే కార్యక్రమాన్ని తిలకించేందుకు క్రీడాభిమానులు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని వారు తెలిపారు, సంక్రాంతి సెలవులు ఉన్నప్పటికీ ఈ క్రీడా పోటీలు విజయవంతం చేసే దిశగా అందరూ సహకరించాలని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పఠాన్ అలీ ఖాన్ ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, డాక్టర్ బి చెన్నారెడ్డి, ఎంఈఓ2 సునీత ఈఓపిఆర్డి సురేష్ బాబు, కార్యదర్శులు, పీఈటీలు పాల్గొన్నారు.

About Author