PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆడుదాం ఆంధ్రా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చెయ్యండి

1 min read

– మున్సిపల్ కమిషనర్  కిషోర్.

– వాలంటరీలకు ఆడుదాం ఆంధ్రా పై శిక్షణా కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ఆంద్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 15 నుండి జరుగబోయే  “ఆడుదాం ఆంధ్రా -2023” క్రీడలను సచివాలయ స్థాయి లో ఏ విధంగా నిర్వహించాలి అనే అంశంలో నందికొట్కూరు పట్టణానికి చెందిన 14 సచివాలయాల వార్డు వాలంటీర్లకు  శనివారం నందికొట్కూరు మండల వ్యాయామ ఉపాధ్యాయులు స్థానిక కిసాన్ పార్కు నందు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్  కిషోర్  ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశంలో మండలపరిధిలోని వ్యాయామ ఉపాధ్యాయులు వాలంటీర్లకు ఆడుదాం ఆంధ్రా-2023 షెడ్యూల్ , నగదు బహుమతి, నియమ, నిబంధనలు వివరించారు. అనంతరము కాంపిటీటివ్ గేమ్స్ అయిన క్రికెట్, వాలీ బాల్,కబడ్డీ, ఖో- ఖో, షటిల్ బ్యాడ్మింటన్ లు సచివాలయ స్థాయిలో ఏ విధంగా నిర్వహించాలి అని ప్రాథమిక శిక్షణ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ కిశోర్   మాట్లాడుతూ క్రీడాకారుల మరియు ప్రేక్షకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని వార్డు వాలంటీర్లను ఆదేశించారు.15 సంవత్సరాలు పైబడిన పురుషులు, మహిళలు క్రీడల్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని    ఈ నమోదు ప్రక్రియ లో వార్డు వాలంటీర్లు చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో నంద్యాల మరియు కర్నూలు జిల్లాల శాప్ కో- ఆర్డినేటర్ లు స్వామిదాసు రవి కుమార్, శ్రీనాథ్ పెరుమాళ్ళ, నియోజక వర్గ ఇంఛార్జి  డోరతి, మండల ఇంఛార్జి వీరన్న, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాలేజి ఫిజికల్ డైరెక్టర్ ఆసిఫ్ ఫిజికల్ డైరెక్టర్ లు విజయ కుమారి, జెసింత, రాజేశ్వరి,సరస్వతి, పద్మ లత, సుంకన్న, రాగన్న, రజాక్ తదితరులు పాల్గొన్నారు.

About Author