NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆడుదాం- ఆంధ్ర విజేతలకు బహుమతులు ప్రధానం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  ఆడుదాం – ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా వివిధ క్రీడల లో విజేతలుగా నిలిచిన టీం సభ్యులకు మండల వైఎస్సార్ సీపీ నాయకులు, జి ఎన్ భాస్కర్ రెడ్డి , వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, శనివారం ఆట వస్తువులతో పాటు టీ షర్టులు, టోపీలు అలాగే మరికొన్ని బహుమతులు అందజేశారు, ఈ సందర్భంగా జి ఎన్ భాస్కర్ రెడ్డి , ముదిరెడ్డి సుబ్బారెడ్డి లు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలోని క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ప్రజలకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవకాశాన్ని కల్పించి వారిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందన్నారు, ఈ క్రీడల ద్వారా క్రీడాకారులకు మానసిక ఉల్లాసంతో పాటు, మనో సంకల్పం కూడా దక్కుతుందని వారు తెలియజేశారు, అంతేకాకుండా వీరిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని మరింత పెంపొందించేందుకు గ్రామస్థాయి నుండి, మండల స్థాయి, మండల స్థాయి నుండి, జిల్లాస్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించబడుతుందని వారు తెలిపారు, గ్రామీణ క్రీడలకు ఇంతటి మంచి సదవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ది వెంకటసుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి, వెటర్నటీ డాక్టర్ ఉపేంద్ర , సాగర్ వివిధ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులు.

About Author