మే డే స్పూర్తితో కార్మిక చట్టాలను, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
1 min readఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా 138వ మే డే వేడుకలు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేస్తామని, మే డేస్ఫూర్తితో కార్మిక చట్టాలను, రాజ్యంగాన్ని పరిరక్షించుకుంటామని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు హెచ్చరించారు.. 138వ మే డే సందర్భంగా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు జండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పారిశ్రామికవేత్తల చేతుల్లో నలిగిపోతున్న కార్మిక వర్గం 1886వ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో తిరుగుబాటు చేస్తూ 24 గంటల పని విధానం వద్దు. ఎనిమిది గంటల పని విధానం కావాలని పోరాడి అనేక వీరులు మరణం చెందిన రోజు, ఎర్రజెండా సాక్షిగా ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించిన రోజు అని వారన్నారు.. అలాంటి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నేడు దేశంలో కార్మికవర్గం మోడీ చేతుల్లో నలిగిపోతుందని, కార్పొరేట్ కబంధ హస్తాల్లో పరిపాలన కొనసాగుతుందని వారు అన్నారు. ఈ దేశ సంపాదన కార్పొరేట్లకు అప్పగిస్తూ బ్రిటిష్ నాటి కాలంలో పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి మోదీ కార్మిక వ్యతిరేకంగా మారారన్నారు.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచడం లేదన్నారు.. స్కీం కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడని వారు విమర్శించారు. ఇలాంటి తరుణంలో కార్మిక హక్కుల పరిరక్షణ కు మరో పోరాటానికి సిద్ధంగా కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటియు సి నాయకులు నరసింహ, వెంకటరమణ,రమణమ్మ, స్థానిక నాయకులు డాక్టర్ ఎఱ్ఱన్న, నారాయణ్ గౌడ్, తిరుపాలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.