NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలికను రక్షిద్దాం… బాలికను చదివిద్దాం..

1 min read

ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బాలికను రక్షిద్దాం బాలికను చదివిద్దాం అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింప చేస్తామని ప్రమాణం చేస్తున్నట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. గురువారం మండల పరిధిలోని వడ్డేమాన్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,అల్లూరు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో  బేటి బచావో బేటి పడావో పై బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల కోసం బేటి బడావో బేటి పడావో అనే పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని తెలిపారు. దేశంలో ఆడపిల్లల చుట్టూ తిరుగుతున్న సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం చే ఒక చొరవన్నారు. లింగ నిష్పత్తులను సమతుల్యం చేయడం, ఆడపిల్లల హక్కులపై దృష్టి సారించడం, బాలిక పిల్లల విద్యలో ప్రవేశాన్ని సాధించడం, ఆడ శిశు హత్యలను అరికట్టాలని,ప్రతి ఆడపిల్లకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శెట్టి లలితమ్మ ,సగినేల వెంకట రమణమ్మ, ఇందిరమ్మ , పార్వతమ్మ, సరస్వతి, మహేశ్వరమ్మ, శ్రావణి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివశంకర్, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

About Author