ఆడపిల్లను రక్షిద్దాం చదివిద్దాం… ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : సమాజంలో ఆడపిల్ల వివక్షకు గురికాకుండా రక్షించి, బావి భవిష్యత్తులో పురుషులతో సమానంగా మహిళా సాధికారత సాధించుట కొరకు ఆడపిల్లలను చదివిద్దాం అంటూ సోమవారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, బాలికల ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన సమావేశంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల తెలియజేశారు. బేటి బచావో, బేటి పడావో జాతీయస్థాయి కార్యక్రమంలో భాగంగా బాలికలను చైతన్యవంతులను చేయుటకు సమావేశపరిచి పలు సూచనలు ఇచ్చారు. భారతదేశంలోని బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం అన్నారు. ఈ పథకం 2015లో హర్యానాలో పానిపట్లో వందలాది కోట్ల నిధులతో ప్రారంభించబడిందన్నారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం లింగ వివక్ష మహిళా సాధికారత కోసం ప్రారంభించబడిందన్నారు. మహిళా శిశు అభివృద్ధి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే జాతీయ కార్యక్రమం అన్నారు. ఆడపిల్ల పట్ల వివక్ష పెరిగి బ్రూణ హత్యలు, అబార్షన్ కు దారితీస్తుంది అన్నారు. మగ పిల్లల శాతం పెరిగి, ఆడపిల్లల శాతం తగ్గుతుందన్నారు. దీనికి కారణం లింగ వివక్షేనన్నారు. ఈ సమావేశంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోటయ్య, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ప్రభుత్వ వైద్యాధికారి ఇమ్రాన్, హెల్త్ ఎడిటర్ వెంకటమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రవణమ్మ, హెల్త్ సూపర్వైజర్లు రామలింగారెడ్డి, వెంకటేశ్వర్లు, రామ్మోహన్, ఆరోగ్య కార్యకర్తలు, ఎమ్ యల్ హెచ్ పీ లు , అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, సచివాలయ మహిళ సంక్షేమ కార్యదర్శిలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.