PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేనేత వృత్తిని కాపాడుకుందాం..

1 min read

– రాష్ట్ర బడ్జట్​లో చేనేతకు రూ.1000 కోట్లు కేటాయించాలి
– చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరభాస్కర్​
పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో: కరోన సంక్షోభంలో చేనేతలను పరిరక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరభాస్కర్​, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతల డిమాండ్ల సాధన కోసం బుధవారం చేనేతలదరూ వారి వారి ఇళ్లల్లో ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జూప్​ యాప్​ ద్వారా వీరభాస్కర్​, ఈశ్వరయ్య మాట్లాడుతూ సిల్క్​ హౌస్​లో వ్యాపారం లేకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, మొరగుడి, పోరుమామిళ్ల, సితరంపల్లె , పులివెందుల, నూలివీడు , సింహాద్రిపురం తదితర ప్రాంతాల్లో గుంత మగ్గలు ఉన్నాయని, వారందరికీ గత15 నెలలుగాకు మూడు నాలుగు నెలలు మాత్రమే పని దొరికిందని, దీంతో వారు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కలర్​ అద్దె కార్మికులు, వార్పులు రేషాలు, డోలు చుట్టే కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తచేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చేనేతలకు రూ.1000 కోట్లు బడ్జెట్​లో కేటాయించాలని, కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రతి నెలా రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అంతేకాక మగ్గం ఉన్న వారిలో కొందరికి మాత్రమే రూ.2400 ఇస్తున్నారని, అలా కాకుండా చేనేత వృత్తిని నమ్ముకుని జీవించే ప్రతి కార్మికుడికి ఆ మొత్తం వారివారి ఖాతాలో జమ అయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని బ్యాంకు అధికారులు వారి ముద్రణ రుణాలు అప్లికేషన్ అప్లై చేసుకున్న వారికి ముద్రణ రుణాలు చేనేత ముద్రణ రుణాలు ఇవ్వాలని, చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, చేనేత రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరభాస్కర్​, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రామనపల్లె అధ్యక్షులు పి.. బాలచంద్ర, కార్యదర్శి పి. మల్లికార్జున, పి. మునయ్య, చెంగా నారాయణ ,ముద్దురు రమణ, ఎన్​. బ్రహ్మయ్య, బండి నారాయణ, నూలివీడు ఓర్సు అంజినేయులు, చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author