PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలల హక్కులను కాపాడుదాం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: వీధి బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు  జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్​లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. డీఆర్​ఓ పుల్లయ్య నేతృత్వంలో జరిగిన  సమీక్షలో వీధిబాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. సమీక్షలో ఐసీడీఎస్​  డీపీఓ ( జేబ్ల్యూ), సీడబ్ల్యూసీ చైర్మన్​, డీసీఎల్​, డీసీపీఓ, డీసీఆర్​బీ తదితరులు పాల్గొన్నారు.

About Author