పోరాట యోధులను స్మరించుకుందాం..
1 min readపల్లెవెలుగు వెబ్:చెన్నూరు చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులను వారి త్యాగాలను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కార్యదర్శి రామ సుబ్బారెడ్డి అన్నారు. 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల లో భాగంగా బుధవారం గ్రంథాలయం చెన్నూరు నందు గ్రంథాలయ ఉద్యమ కారుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటానికి చెన్నూరు పంచాయితీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి పుష్పాలంకరణ చేసి నివాళులు అర్పించారు. అలాగే స్వాతంత్ర్య పోరాట యోధుడు, గ్రంథాలయ ఉద్యమ నేత శ్రీ పాతూరి నాగభూషణం చిత్రపటానికి చెన్నూరు సహకార బ్యాంక్ మేనేజర్ గంగిరెడ్డి పుష్పాలంకరణ చేసి నివాళి అర్పించారు.,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమానికి ఈ మహనీయులు చేసిన సేవ, సారథ్యం కొనియడదగినవని పేర్కొన్నారు, గ్రంథాలయానికి ఇటీవల సరఫరా అయిన సుమారు 3 లక్షల విలువైన క్రొత్త పుస్తకాలను విద్యార్థులు, పాఠకులు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలనివారు తెలియజేశారు. అలాగే లైబ్రరీ కు వచ్చిన కొత్త పుస్తకాలను వారు పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి, అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు పుస్తక పఠనం- ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు, ఈ కార్యక్రమంలో విజేత మహిళా మండలి అధ్యక్షురాలు గోసుల అరుణకుమారి, లైబ్రరీయన్ జి. రాజ్ కుమార్, పంచాయితీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ , గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.