PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..

1 min read

టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి…

టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా: పాలకుడే విధ్వంసకుడై , ప్రజలకు చేసిన వాగ్దానాలను నిర్లజ్జగా, నిర్భయంగా  ఉల్లంగిస్తూ వికృతి క్రీడలు ఆడుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పిలుపునిచ్చారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఎస్ సి సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలలో బడేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ తప్పుడు సాక్షాలతో అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై చెడు ముద్ర వేసి జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన చంద్రబాబు కోట్లాది రూపాయల సంపద సృష్టిస్తే నేడు ముఖ్యమంత్రి జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చి ప్రజలకు తీరని నష్టం చేకూర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాలను రాబోయే ఎన్నికలలో ఓటు  రూపంలో  తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా  బాలాజీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులకు చెందిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేసి నిరుద్యోగ యువతకు తీరని ద్రోహం తలపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ అధికారం చేపట్టిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని దీనిని ఐక్య పోరాటాల ద్వారా ఎదుర్కొని ముఖ్యమంత్రి జగన్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దళితులందరూ తెదేపాకు  ఉండాలని కోరారు. నగరంలోని 200 మంది మహిళలు నిరాహార దీక్ష కు సంఘీభావం తొలిపి పాల్గొన్నారు.ఈ దీక్షలలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ నాయకులు జి మోజేష్, టిడిపి ఎస్ సి సెల్ నగర అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ, కార్యదర్శి నెల్లిమెల్లి వెంకన్న, మాజీ ఎంపీపీ మాణిక్యాలరావు,తూమాటి విక్కీ, వీర బత్తిన రత్తయ్య, జె శివశంకర్, వి రాజేష్, శ్యామ్ సరూప్, గుంటూరు ప్రకాష్ యూత్, టిడిపి సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

టిడిపి, వైసీపీ, నిరాహార దీక్ష, ఎంపీపీ,

About Author