PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కన్నడ…ఉర్దూ ప్రాంతీయ భాషలను కాపాడుకుందాం…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ప్రాణాలనర్పించైనా కన్నడ,ఉర్దూ భాషలను రక్షించుకుంటాం – కర్ణాటక నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు భీమాశంకర్ పాటీల్…ప్రాంతీయ భాషలైన కన్నడ,ఉర్దూ భాషలను కాపాడుకోవడానికి తమ ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధమని కర్ణాటక నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు భీమాశంకర్ పాటీల్ అన్నారు.ఈ సందర్భంగా సోమవారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ తో కలిసి స్థానికంగా సి బి ఎస్ సి అఫిలియేటెడ్ సిలబస్ వల్ల నష్టపోతున్న కన్నడ ఉర్దూ మాధ్యమాల గురించి ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ కన్నడ ఉర్దూ భాషలు మైనారిటీ భాషలుగా ఉంటూ వెనుకబాటు తనానికి గురవుతున్నాయని ఆక్రోశం వెలిబుచ్చారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న పాఠశాలలో కన్నడ ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు బలవంతంగా సిబిఎస్ఇ అఫిలియేటెడ్ భాషలను అంటి పెట్టడం ద్వారా విద్యార్థులు విద్యకు దూరమవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. కన్నడ ఉర్దూ భాషలకు సీబీఎస్ఈ సిలబస్ ఓ అడ్డంకిగా ఏర్పడిందని దీనిద్వారా కన్నడ మాధ్యమా మరియు ఉర్దూ మాధ్యమ విద్యార్థులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్నారు. ఆర్టికల్ 350 బి ద్వారా ప్రాంతీయంగా ఉండి వెనుకబాటు తనానికి గురవుతున్న కన్నడ ఉర్దూ మరియు ఏ ఇతర ప్రాంతీయ భాషలను కూడా పిల్లల ఇష్టానుసారంగా చదువుకునే వెసులుబాటు ఉందని ఆయన ప్రధానోపాధ్యాయులకు తెలియపరిచారు. ఈ మూలంగానే విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ను బలవంతంగా రుద్దటాన్ని వారు వ్యతిరేకిస్తూ దీనిపై తాము ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సైతం సిద్ధమని హెచ్చరించారు. ఇదే విషయంపై తాము విద్యార్థులను విద్యాభ్యాసం నుంచి దూరం చేస్తున్న సీబీఎస్ఈ సిలబస్కు వ్యతిరేకంగా కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధమన్నారు. ఇదే విధంగా కర్ణాటక ప్రాంత సరిహద్దు ప్రాంతంలో ఉన్న తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కేరళ తమిళనాడు తదితర ప్రాంతాలలో పోరాటాలు సాగించి ప్రాంతీయంగా ఉన్న భాషల ను పాఠశాలలో చదివేందుకు తాము న్యాయబద్ధంగా పోరాటం సాగించి అక్కడ గెలిచామని ఇక్కడ కూడా న్యాయబద్ధంగా కోర్టు నాశ్రయించి స్థానిక పాఠశాలలో కన్నడ ఉర్దూ మాధ్యమాలలో విద్యార్థులు చదివేల చర్యలు చేపడుతామని సూచించారు. కన్నడ ఉర్దూ భాషలపై మక్కువ చూపిన స్థానిక కన్నడ యువక సంఘం మరియు ఉర్దూ యువక సంఘాలను ఆయన అభినందించారు. అనంతరం ఎంతో శ్రమించి తమ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరు నుంచి ఇక్కడికి విచ్చేసిన నవనిర్మాణ సేన కర్ణాటక అధ్యక్షులైన బీమా శంకర్ పార్టీ మరియు రాష్ట్ర కార్యదర్శి డి విజయ్ కుమార్ లను స్థానిక కన్నడ మరియు ఉర్దూ సంఘం నాయకులు శివశంకర్ గౌడ్ గవిసిద్దన గౌడ్ రుద్ర గౌడ్ తదితరులు ఆయనను శాలువా పూలమాలలతో సత్కరించారు. అలాగే ఆయన కూడా స్థానిక ప్రధానోపాధ్యాయుడు నజీర్ అహ్మద్ను శ్రీ శరణబసవ చిత్రపటం అందించి ప్రధానోపాధ్యాయులను, మరియు కన్నడ యువక సంఘం నాయకులు శివశంకర్ గౌడ్ లను సత్కరించారు.ఈ కార్యక్రమంలో కర్ణాటక నవనిర్మాణ సేన రాష్ట్ర కార్యదర్శి డి విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షులు జి కీర్తి కుమార్ బళ్లారి నగర అధ్యక్షులు యువరాజు బళ్లారి నగర ఉపాధ్యక్షులు వెంకటేష్ బయలురు కన్నడ సంఘ యువత సంఘం నాయకులు ఉర్దూ యువక సంఘం నాయకులు హమీద్, సుభాన్, అల్లా బకాష్, ఎస్ఎంసి చైర్మన్ సిద్ధప్ప ,మెంబర్లు మంగయ్య, కన్నడ ఉపాధ్యాయులు విజయలక్ష్మి తిప్పేస్వామి దొడ్డ బసప్ప, గ్రామస్తులు పుట్టప్ప బసవ తదితరులు పాల్గొన్నారు.

About Author