కోవిడ్ బాధితులను కాపాడుకుందాం..
1 min read– ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగువెబ్, రాయచోటి: కోవిడ్ బాధితులకు అండగా నిలిచి.. వారిని కాపాడుకుందామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాలివీడు మండలంలోని నూలివీడు, గాలివీడు ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో అందుతున్న కోవిడ్ సేవలతోపాటు నిర్దారణ పరీక్షలపై ఆరా తీశారు. ఇంటివద్ద చికిత్స పొందుతున్న వారికి హోమ్ ఐషోలేషన్ కిట్ల సరఫరాపై అడిగి తెలుసుకున్నారు. . ప్రతి పి హెచ్ సి లో కోవిడ్ ఐషోలేషన్ రూములుము ఏర్పాటు చేసి, ఆక్సిజన్ సిలెండర్లు ను ఏర్పాటు చేసుకుని బాధితులకు వైద్యం అందించాలని ఆదేశించారు. నూలివీడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 14, గాలివీడు ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, నలుగురు వ్యక్తులు ఇతర ప్రాంతాలలో చికిత్సలు పొందుచున్నారని, మిగిలిన వారందరికీ హోమ్ ఐషోలేషన్ కిట్లు అందజేశామని వైద్యాధికారులు చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డికి వివరించారు.