NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం

1 min read

– ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్.

పల్లెవెలుగు వెబ్ ఆదోని: ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం అని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. బుదవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ నందు రెవెన్యూ, సర్వే, మునిసిపల్, ఆర్కియాలజీ, షాహి జామియా మసీదు పెద్దలలో మసీదు పరిసరాలలో జరుగుతున్న కట్టడాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ….500 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాచీన కట్టడాలైన మసీదును అందరం కలసి కాపాడుకోవాల్సిన బాధ్యత బాధ్యత మనపై ఉందని, మసీద్ పరిసరాల ప్రాంతాల్లో జరుగుతున్న కట్టడాలపై రెవెన్యూ, సర్వే, మునిసిపల్ అధికారులతో కలిసి ప్రాధమిక విచారణ చేపట్టి నివేదికలు ఉన్నత అధికారులకు  పంపించడం జరుగుతుంది అన్నారు .ఈ కార్యక్రమంలో  డిప్యూటీ తాసిల్దార్ రజనీకాంత్ రెడ్డి, మండల సర్వేయర్ రమణ, మున్సిపల్  అసిస్టెంట్  సిటీ ప్లానర్ శ్రీనివాసులు షాహి జామియా మజీద్ పెద్దలు  సౌదీ రావూఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author