NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏవిఎస్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: యుటిఎఫ్

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: సమైక్య ప్రజాతంత్ర ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించిన యుటిఎఫ్ వ్యవస్థపాక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి గారి ఆశయ సాధనకు ప్రతి యుటిఎఫ్ కార్యకర్త కృషి చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి:యస్.నరసింహులు అన్నారు.మంగళవారం స్థానిక మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(UTF) మండల శాఖ ఆధ్వర్యంలో యుటిఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి గారి 22వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ వర్ధంతి కార్యక్రమంలో ముందుగా అప్పారి వెంకటస్వామి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తదనంతరం యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు:రామన్,చంద్రపాల్ గార్లు మాట్లాడుతూ అప్పారి వెంకటస్వామి గారు సంఘ అభివృద్ధికీ,ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు నిర్మించి ఉపాధ్యాయులకు అనేక హక్కులను,రాయితీలను కల్పించడంలో ఎనలేని కృషి చేశారు.అనేక ఉద్యమాలు చేసి సాధించిన హక్కులను నేడు క్రమంగా ఒక్కోక్కటిగా కోల్పోతున్నాం.కావున ఏవిఎస్ గారు చూపిన బాటలో పయనిస్తూ యుటిఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమాన్ని మరింత సమున్నతంగా తీర్చి దిద్దుతూ,ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రవేటీకరించే విద్యావిధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విద్యా రక్షణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు విజయ్ కుమార్,దుబ్బన్న, జిక్రియ, బాబు,లక్ష్మణ్,స్వర్ణమంజుల,వరలక్ష్మి మొదలగువారు పాల్గొన్నారు.

About Author