కురువ పురుషోత్తం జోస్మిత ను విద్యాపరంగా ఆదుకుంటాం..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురవ సంఘం… కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం హెచ్ మురవణి గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన కురవ మల్లేశ్వరి కుమారుడు పురుషోత్తం కుమార్తె జోస్మిత చదువుల కోసం ఆదుకుంటామని కర్నూలు జిల్లా కురవ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి,పెద్దపాడు ధనుంజయ జిల్లా ఉపాధ్యక్షుడు టి . ఉరుకుందు ,పెద్దపాడు పుల్లన్న సోమవారం గ్రామానికి వెళ్లి పిల్లలను పరామర్శించి వారి చదువుల కోసం అయ్యే ఖర్చును కర్నూలు జిల్లా సంఘం భరిస్తుందని తాత భాస్కర్ కు హామీ ఇచ్చారు అబ్బాయికి తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి విషయంలో కూడా అధికారులతో మాట్లాడి పూర్తి సహకారం అందిస్తామని వారు భరోసా ఇచ్చారు.