వృద్ధుల సంక్షేమం కోసం పాటుపడుదాం
1 min readప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు:వృద్ధుల సంక్షేమం, భద్రత కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూల్ నగరంలోని గాయత్రి స్టేట్లో సద్గురు దత్త పాలి క్లినిక్ లో నిరుపేద మహిళలకు ఆయన చీరలు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మనదేశంలో 2007 లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం వచ్చిందని, వృద్ధుల సంక్షేమం, భద్రత కోసమే ప్రతిష్ట చట్టాలను దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం నేటి తరానికి ఉందన్నారు. సమాజంలో అక్కడక్కడ వృద్ధులకు ఆర్థిక మానసిక , ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయన్నారు. పండుటాకుల వేదనా భరితంగా జీవితాన్ని అనుభవిస్తున్న వారి సంక్షేమం భద్రత కోసం ప్ర టీ ష్ట చర్యలు తీసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నేడు వృద్ధాశ్రమాలు పెరుగుతుండడం చూస్తే వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు కొరవడుతున్నాయని నేటి తరం మేల్కోవలసిన అవసరం ఉంద నీ వృద్ధులని ఆదరిస్తూ పూజించాలన్నారు.