NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దాం

1 min read

వై.నాగేశ్వరరావు యాదవ్?తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్?జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్?

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై. నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు డోన్ నియోజకవర్గం, ప్యాపిలి మండలం , బావిపల్లే,హుసేనాపురం చండ్రపల్లె,వెంకటకొండాపురం,పిఆర్ పల్లి,మామిళ్ళపల్లి,రాంపురం, నల్లమేకలపల్లె గ్రామాల్లో బాబు స్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్మాట్లాడుతూ మహానాడులో నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేయాలి.అధికార పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను, అరాచకాలను అన్యాయాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకించాలి. అదేవిధంగా తెలుగుదేశంపార్టీ చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది.యువత ముఖ్యంగా సోసల్ మీడియా లో యాక్టివ్ గా ఉండాలి.తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు అందరు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి.వైసీపీ అరాచకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలి. వాట్సప్, ఫేస్బుక్ ద్వారా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్ళాలి.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి,మహేంద్ర, సూరి గౌడ్,వల్లే శీను,మురళీమోహన్ రెడ్డి,తిమ్మారెడ్డి,గంగాధర్ రెడ్డి,శీను,ఆదినారాయణ,నరసింహులు చౌదరి,రామకృష్ణ, రామ్మోహన్, వెంకటరాముడు, కమ్మగిరి, నరేష్, మాధవరాజు,సందీప్, మల్లికార్జున,తిరుపతయ్య, మహేష్,నాగిరెడ్డి, రామచంద్ర,తిమప్ప, రాజశేఖర్ నాయుడు, భాస్కర్ నాయుడు,నాగేశ్వరరావు, రామాంజనేయులు, నాగేంద్ర,శివ,జానకి రాముడు,నాగేశ్వరరావు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author