PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ కు “గట్టిబుధ్ధి” చెబుదాం

1 min read

– గోరంట్ల రమణ విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం ఉదయం 11:00 గం లకు కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ” బజరంగ్ దళ్ ” ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి ప్రసాదించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు గల మహాత్ముని ముందు తీవ్రమైన ఎండను కూడా లెఖ్డచేయక కార్యకర్తలందరూ రోడ్డు పై బైఠాయించి ” హనుమాన్ చాలీసా ” పారాయణం చేశారు అనంతరం విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణమాట్లాడుతూ…. చరిత్రలో ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికల్లో మైనార్టీ వర్గాలను .సంతుష్టీకరణ కోసం జాతీయ భావాలతో ,నిరంతరం దేశంగురించి ఆలోచించే విశ్వ హిందూ పరిషత్ లోని యువ విభాగమైన ” బజరంగ్ దళ్ ” ను నిషేధిస్తామన్న విషయాన్ని తమ పార్టీ ఎన్నికల ” మ్యానిఫేస్టో ” ఉంచి దేశంలోని అన్ని మతాలను సమానంగా చూడవలసిన ఘన చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం వారిని సంతోష పెట్టే ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీసింది,అధికారం కోసం ఇంత దిగజారుడు తనం ప్రదర్శించడం కాంగ్రెస్ పార్టీ కే చెల్లిందని, దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని,కర్ణాటక ఎన్నికలతో పాటు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని జోస్యం చెప్పారు, హనుమాన్ చాలీసా లో వచ్చే ఒక పంక్తిలో ” కుమతి నివార సుమతి కే సంగీ ” అని ఉన్నదనీ దాని అర్థం “దుర్భుధ్ధిని తొలగించి సద్బుద్ధి ని ప్రసాదించే స్వామీ” అని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దుర్భుధ్ధిని తొలగించు స్వామీ అని హనుమాన్ చాలీసా పారాయణం చేశామని తెలియజేశారు. కర్నూలు నగర అధ్యక్షులు టీ.సీ. మద్దిలేటి మాట్లాడుతూ ఉగ్రవాద మూలాలు కలిగిన ఫీ.ఎఫ్.ఐ.సంస్థ తో కలిపి బజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకున్నదనీ, బజరంగ్ దళ్ అంటే దేశభక్తి, హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కొరకు మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నదనీ… ఉచిత రక్తదానం,స్మశానాలను శుభ్రపరచడం,యువతను వ్యసనాలకు దూరంగా ఉంచడం,పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం వంటి ఎన్నోకార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు.బజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ మాట్లాడుతూ ..దేశంలో ప్రతి హిందూ యువకుడు బజరంగ్ దళ్ కార్యకర్తయే అని వారు తలుచుకుంటే ఇప్పటికే “అంపశయ్య” పై ఉన్న కాంగ్రెస్ పార్టీని “బంగాళాఖాతం” లో కలపడం ఖాయమని అందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉన్నదని,అందు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండిలని హెచ్ఛరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, జిల్లా సహకార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి శ్రీనివాస రెడ్డి, జిల్లా ప్రసార – ప్రచార కన్వీనర్ రామకృష్ణ , మల్లికార్జున , నగర ఉపాధ్యక్షులు కృష్ణపరమాత్మ,కార్యదర్శి ఈపూరి నాగరాజు,బజరంగ్ దళ్ నగర కన్వీనర్ భగీరథ,కో కన్వీనర్ నాగరాజు, అరుణ్ కుమార్, ప్రఖండ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి గూడూరు గిరిబాబు, చిన్న రంగు స్వామి, బజరంగ్ దళ్ కన్వీనర్ భాస్కర్,సల్కాపురం బాబూరావు,సాయి,తదితరులు పాల్గొన్నారు.

About Author