జగనన్నకు చెబుదాం.. గ్రీవెన్స్ డే కు మంచి స్పందన
1 min read
మండలస్ధాయి గ్రీవెన్స్ డే కు మంచి స్పందన..
పెదవేగి జెకెసి లో 122 అర్జీలు స్వీకరణ.. జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ప్రజా సమస్యలు నేరుగా పరిష్కారానికి మండలస్ధాయిలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ డే కు మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. శుక్రవారం పెదవేగి మండలం రాట్నాలకుంట అన్నపూర్ణ పంక్షన్ హాలులో నిర్వహించిన జగనన్నకు చెబుదాం మండలస్ధాయి గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్,జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్, జిఎస్ డబ్ల్యూఎస్ నోడల్ అధికారి రమణ, అర్జీదారులనుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు, యంపిపి తాతా రమ్య , వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండలస్ధాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జెకెసిలో వివిధ సమస్యల పరిష్కారం కోసం 122 మంది అర్జీలను అందజేశారని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ప్రతి బుధవారం, శుక్రవారం ఆయా మండలాల్లో జగనన్నకు చెబుదాం మండలస్ధాయి కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులంతా పాల్గొంటారన్నారు. క్షేత్రస్ధాయిలో చేపట్టిన జగనన్నకు చెబుదాం తొలి కార్యక్రమాన్ని పెదవేగి మండలంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్ధాయిలో తెలుసుకొని అక్కడికక్కడే వివరాలు నమోదు చేయడంకోసం మండలస్ధాయిలో జగనన్నకు చెబుదాం అర్జీలను నేరుగా స్వీకరించడం జరిగిందన్నారు. జెకెసిలో అందిన అర్జీలను పరిష్కరించడంపై ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సెప్టెంబరు మాసంలో చింతలపూడి మండలంలో సెప్టెంబరు 13వతేదీన, ద్వారకాతిరుమల మండలంలో సెప్టెంబరు 15వతేదీన, టి. నర్సాపురం మండలంలో సెప్టెంబరు 20వ తేదీన, ఉంగుటూరు మండలంలో సెప్టెంబరు 22వ తేదీన, ముసునూరు మండలంలో సెప్టెంబరు 27వ తేదీన, కలిగింది మండలంలో సెప్టెంబరు 29వతేదీన నిర్వహించబడుతుందన్నారు. ప్రజలు జెకెసి కార్యక్రమాన్ని సద్వినియోగంచేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ జెకెసిలో అందిన అర్జీలను ఆయా శాఖల వారీగా నమోదు చేసుకోని వాటిని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవలసివుంటుందన్నారు. వైఎస్ఆర్ భీమా కింద గ్రామాల్లో నూరుశాతం నమోదు అయ్యేలా సంబంధిత అధికారులు చూడాలన్నారు. స్పందనలో అందిన అర్జీల్లో కొన్నింటి పరిష్కారతీరులో అర్జీదారుల్లో అసంతృప్తి వుందని వాటిని నూరుశాతం రీఓపెన్ చేసి అర్జీదారుడు సంతృప్తిచెందేలా సంబంధిత జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల తహశీల్దార్ ఎన్ నాగరాజు, యంపిడిఓ జి రాజ్ మనోజ్, విస్తీర్ణ అధికారి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
జెకెసిలో వచ్చిన అర్జీల్లో
పెదవేగి మండలం రాయనపాలెం కు చెందిన విభిన్న ప్రతిభావంతుడైన పలగని శ్రీనివాసరావు తన సమస్య పరిష్కారం కోసం రాగా అతనిని చూసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వేదిక దిగి స్వయంగా అతని సమస్యను తెలుసుకున్నారు. జామకాయల అమ్ముకుంటూ జీవించే తనకు ప్రభుత్వం వారు వికలాంగులకు ఇచ్చే మూడు చక్రాల వాహనం ఇప్పించాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందిస్తూ ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ను ఆదేశించారు. రాయనపాలెంకు చెందిన తాళం ప్రసాద్ అర్జీనిస్తూ బాపిరాజు గూడెంలో తమకు వ్యవసాయభూమి ఉందని దానిని ఆన్ లైన్ చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయంపై తగు చర్యలుతీసుకోవాలని పెదవేగి తహశీల్దార్ నాగరాజు ను ఆదేశించారు. బాపిరాజు గూడెంకు చెందిన బొప్పన శ్రీఫణికుమార్ తదితరులు అర్జీనిస్తూ 131 ఎకలాల విస్త్రీర్ణంలో ఉన్నచెరువు ఆక్రమణకు గురైయిందని చెరువులోకి నీరు రాకుండా చేసియున్నారని ఈవిషయంపై సర్వేచేయించిఆక్రమణలు తొలగించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిబంధనలకు అనుగుణంగా నోటీసు ఇవ్వడం ద్వారా ఆక్రమణలు తొలగించేందుకు చర్యలుతీసుకోవాలని ఏలూరు ఆర్డిఓను ఆదేశించారు. రాట్నాల కుంటకు చెందిన కొడాలి రాధాకృష్ణమూర్తి అర్జీఇస్తూతనకు పెదవేగిలో ఎకరంన్నర వ్యవసాయభూమి ఉన్నదని అది ఆక్రమణకు గురైయిందన్నారు. ఆక్రమణనుండి తనభూమిని విడిపించాలని కోరారు. దీనిపైజాయింట్ కలెక్టర్ స్పందిస్తూ తహశీల్దార్, ఎస్ హెచ్ఓలు ఈవిషయంపై పరిశీలనచేసితగు చర్యలు తీసుకోవాలన్నారు. సివిల్ వివాదాల పరిష్కారంలో స్ధానిక యంఆర్ఓ, యంపిడిఓ, ఎస్ హెచ్ లతో కూడీన మండల కమిటీ అక్కడి కక్కడే పరిష్కార చర్యలను తీసుకోవాలని సూచించారు. గార్లమడుగు(వెంకటకృష్ణాపురం) కు చెందిన నేరూరి ప్రభావతి అర్జీనిస్తూ జగనన్న లేఅవుట్ కు సంబంధించి ఒరిజినల్ ఇంటిపట్టా అందించాలని కోరారు. పెదకడిమి కి చెందిన పర్వతనేని సుబ్బయ్య అర్జీనిస్తూ తమ భూమి సర్వే చేయించుటకు అర్జీ పెట్టుకొనియున్నానని అయితే పర్వతనేని బాపినీడు, వెంకటేశ్వరరావు అనువారు ఎన్నిమార్లు చెప్పినా కొలత సమయంలో హాజరు కావడం లేదన్నారు. తన పొలాన్ని వారి పొలం నుండి విడగొట్టేందుకు సహాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందిస్తూ ఈవిషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ను ఆదేశించారు.