జగనన్నకు చెబుదాం.. ఫిర్యాదులను సీరియస్ గా తీసుకోండి
1 min read– స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి : జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జగనన్నకు చెబుదాంకు ఫిర్యాదులను సీరియస్ గా తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు.శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సచివాలయ పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయని వెల్ఫేర్ అసిస్టెంట్ అడుగగా మొత్తం 993 ఇళ్లు ఉన్నాయన్నారు. 384 మంది వివిధ రకాల పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సచివాలయ పరిధిలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని ఏఎన్ఎంను ఆరా తీశారు, మొత్తం 4 కేంద్రాలు ఉన్నాయని ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తూ ఉండాలన్నారు. గ్రామాల్లో ఉన్న చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో చేర్చాల్సిన బాధ్యత ఏఎన్ఎం మీద ఎంతో ఉందని, జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏఎన్ఎంకు సూచించారు. అంగన్వాడీలోని డేటా పిహెచ్సిలోని డేటా ఒకే విధంగా ఉండేలా చెక్ చేసుకోవాలని, బాల్య వివాహాలు జరగకుండా చూడాలని ఏఎన్ఎంను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3గం.ల నుంచి సా.5గం.ల వరకు నిర్వహించే స్పందన అర్జీల కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు.జిల్లా కలెక్టర్ వెంట కల్లూరు తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపిడిఓ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.