NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీఎస్పీ పార్టీకి ఓటు వేద్దాం- రాజ్యాంగాన్ని కాపాడుదాం

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: బిఎస్పీ పార్టీకి ఓటు వేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం  ఎంతైనా ఉందని బహుజన సమాజ్ పార్టీ నంద్యాల ఇన్చార్జి గద్దలలాజరు నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి లింగాల స్వాములు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంబేద్కర్ కాన్సిరాం ఆశయాలు కొనసాగాలంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మహనీయుల ఆశయాల సాధన కోసం నిర్మించబడినటువంటి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని వారన్నారు.కుల మతాల కుంపట్లను రగిలించి ప్రజలను ఐక్యం కాకుండా రెచ్చగొట్టే విషయాలను ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు ఎక్కించి వారిలో వారికే ఘర్షణ వాతావరణ సృష్టించి బ్రాహ్మణవాద  విధానాలను పెద్ద ఎత్తున చేపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలంటే బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరగాలంటే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీని బలపరచాలని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు రాజ్ కుమార్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author