ప్రజా సేవకుడు సాయినాథ్ శర్మ తో కలిసి నడుస్తాం
1 min readవి ఎన్ పల్లె మండలం అడవిచెర్లోపల్లి సర్పంచ్ చిన్న నారాయణరెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కమలాపురం నియోజకవర్గం ప్రజానాయకుడు నిరుపేదల సేవకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ తో కలిసి తాము నడుస్తామని ఆయన నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వీరపనాయునిపల్లె మండలం అడవిచే ర్లపల్లి సర్పంచ్ నారాయణరెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం పట్టణంలోని సాయినాథ్ శర్మ స్వగృహంలో గురువారం ఉదయం సర్పంచ్ నారాయణరెడ్డి ఆయన అనుచరులు సాయినాథ శర్మను కలిసి ఆయనకు శాలువాదప్పి మద్దతు ప్రకటించారు. ప్రజలకు నిస్వార్ధంగాసేవ చేయాలనే సాయినాథ్ శర్మ భావాలు మాకు నచ్చడంతో మేము ఆయనతో నడవడానికి సిద్ధపడి వచ్చామన్నారు కష్టమైనా నష్టమైనా ఆయన శ్రమతోనే తాము రాజకీయ పయనం చేస్తామన్నారు. సర్పంచ్ నారాయణరెడ్డి తో పాటు అడవి చేర్లోపల్లె నాయకులు రామకృష్ణ, యాదవ సంఘ నాయకుడు రవి రమణ తదితరులు సాయినాథ శర్మను కలిశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ వీరపనాయన పల్లె మండలంలో సాయినాథ్ శర్మ మద్దతు ప్రజాభిమానం సంపాదించడానికి తమ వంతు కృషి శాయశక్తుల చేస్తామన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడిగా నియోజకవర్గ ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి అనుచరుడుగా ఉన్న నారాయణరెడ్డి సాయినాథ్ శర్మకు మద్దతు ప్రకటించడం సర్వత్ర వీరపనేని పల్లె మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.