వెన్నపూస రవీంద్ర రెడ్డిని గెలిపించుకుందాం..
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఉద్యోగ సమస్యలను శాసనమండలిలో వినిపించి తద్వారా నిరుద్యోగ సమస్యలు రూపు దాల్చే విధంగా పోరాడాలంటే పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఓటర్లు వెన్నపూస రవీంద్రా రెడ్డి ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, శనివారం ఆయన చెన్నూరు లో విలేకరులతో మాట్లాడుతూ, విద్యావంతుడు, మృదు స్వభావి వెన్నపూస రవీంద్రారెడ్డిని పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ గా అత్యధిక మెజారిటీతో గ్రాడ్యుయేట్ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు, మంచి మనిషిగా, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఉంటూనే విద్యార్థి దశలోనే నిరుద్యోగ సమస్యలపై అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు, అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీగా శాసనమండలిలో ఉంటే నిరుద్యోగ సమస్యలు ఒకదారి కి తీసుకురావడం జరుగుతుందని ఆయన అన్నారు, ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ లో ప్రతి పట్టుభద్రుల ఓటరు ఇంటికి వెళ్లి కరపత్రాన్ని అందించి, ఇంటిదగ్గర లేని వారికి ఫోన్ ద్వారా ఓటు వేయు విధానాన్ని వివరించి పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల వైయస్సార్సీపి అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి మొదటి (1)ప్రాధాన్యతఓటు వేసి గెలిపించవలసినదిగా ఓటర్లను కోరడం జరిగింది, వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపిస్తే ఒక ఉత్తమ వ్యక్తికి ఓటు వేశామని గర్వంగా ప్రతి ఒక్క గ గ్రాడ్యుయేట్ ఓటరు చెప్పుకునే విధంగా మండలిలో ఆయన పనితనం ఉంటుందని తెలియచేశారు,అంతే కాకుండా ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్న ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పే క్రమంలో ఈ గెలుపుతో వారికి గుణపాఠం కావాలని ఆకాంక్షించారు,పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వెన్నపూస రవీంద్ర రెడ్డిని గెలిపించాలని గ్రామాలలో ఉన్న పట్టభద్రులు ఇండ్లకు వెళ్లి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, గురించి తెలియజేయడం అదేవిధంగా వైయస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలియజేయడం జరుగుతున్నదని ఆయన తెలియజేశారు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు, దీంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, 50 ఇండ్ల కు ఒక వాలంటీర్ను నియమించి అక్కడ ఉండే సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు తెలుగుదేశం మోసపూరిత మాటలను, వాగ్దానాలతో నమ్మి గ్రాడ్యుయేట్ ఓటర్లు మోసపోకూడదని ఆయన తెలియజేశారు, మీరు ఉన్నత చదువులు చదువుకున్న వారు కాబట్టి మీ ఆలోచనలకు తగ్గట్టుగా వైఎస్ఆర్సిపి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మీలోని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్( చిన్న) మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీటీసీలు రఘురాం రెడ్డి, నాగిరెడ్డి, సాదిక్ అలీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.