NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యాభివృద్ధికి పాటుపడదాం: ఎంపీపీ నారాయణదాసు

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పత్తికొండ మండల పరిషత్ అధ్యక్షులు నారాయణ దాసు పిలుపునిచ్చారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఆదివారం ఎస్ టి యు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టారు. ఎస్టియు మండల అధ్యక్షులు బలరాం అధ్యక్షతన జరిగిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎంపీపీ నారాయణ దాసు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయ లోకం పాటుపడాలని సూచించారు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతూనే బాధ్యతలు మరువకూడదని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులకు విజ్ఞానంతో  పాటు సామాజిక, నైతిక విలువలతో కూడిన విద్యను పెంపొందించాలని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎంపీపీ నారాయణదాసు కు ఉపాధ్యాయ బృందం పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ, కుంపటి నారాయణ చంద్రశేఖర్ రెడ్డి బీరప్ప  సుంకన్న పేర్ల ప్ప, వెంకట్రాముడు, గౌస్, ఓబులేసు, చెన్నకేశవులు, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

About Author