రైతుల కోసం.. పనిచేద్దాం.. :రామచందయ్య
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ:రైతుల సమస్యల కోసం పార్టీలకతీతంగా అందరం కలిసి పని చేద్దామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య కోరారు. బుధవారం పత్తికొండ సమీపంలోని మండగిరి రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతాంగ సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో. టిడిపి వైసిపి సిపిఐ సిపిఎం సంబంధించిన రైతు సంఘం నాయకులు పాల్గొని రైతు సమస్యల పరిష్కారానికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పి.రామచంద్రయ్య మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు . పంటలు పండక పెట్టిన పెట్టుబడును తిరిగి రాక అప్పులతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన చెందారు. ఈ తరుణంలో అన్ని పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు . టమోటా రైతుల కోసం జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎన్నికల నినాదంగా మారిపోయిందన్నారు. ఈ ప్రాంతంలోని రైతులంతా సహకార సంఘం ద్వారా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేయాలన్న యోచన వచ్చిందన్నారు. ఈ దిశగా అందరూ ఆలోచించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు చల్లా రవీంద్రనాథ్ చౌదరి రామానాయుడు వైసీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి సిపిఐ నాయకులు జగన్నాథ్ గిడ్డయ్య కారన్న కారుమంచి రంగన్న గురుదాస్ తిమ్మయ్య సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు సిద్దయ్య గౌడ్ వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.