గ్రంథాలయాలు.. విజ్ఞాన భాండరాలు: సర్పంచ్ ప్రమీల
1 min readపల్లెవెలుగు వెబ్:చెన్నూరు గ్రంథాలయాలు విజ్ఞాన భాండరాలు అని సర్పంచ్ చల్ల ప్రమీల అన్నారు. గురువారం ఉదయం ఓబులంపల్లెలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రంథాలయాలు మానవ మనుగడకు, విజ్ఞానానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు, మానవాళికి ప్రపంచంతో ముడిపడే విధంగా సమస్త సమాచారాన్ని అంద చేయడంలో, తెలియ చెప్పడంలో గ్రంథాలయాలు మనకు ఎంతో దోహదపడతాయని ఆమె తెలిపారు, ఓబులంపల్లి గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, గ్రామస్తులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె గ్రామ ప్రజలను కోరారు, గ్రంథాలయంలో దినపత్రికల తో పాటు, వార పత్రికలు, నవలలు అదేవిధంగా దేశ నాయకుల జీవిత చరిత్రలు, ఉంటాయని ఆమె తెలియజేశారు, గ్రంథాలయాలలో చిన్న, పెద్ద తారతమ్యం లేదని అన్ని వర్గాల వారికి అనుకూలమైనటువంటి పుస్తకపటనాలు ఉన్నాయని ఆమె తెలియజేశారు, ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో వాటి విశ్లేషణ అంతా కూడా పుస్తకాలలో దాగి ఉంటుందని, దానిని మనం చదివినప్పుడు వాటిపై అవగాహన కలిగి ఉండటంతో పాటు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో దోహదపడుతుందని ఆమె అన్నారు, ముఖ్యంగా మహిళలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు, కుటుంబంలో ఒక మహిళ విజ్ఞాన వంతురాలుగా ఉంటే ఆ కుటుంబం ఎంతో ఉన్నతి చెందుతుందని, తమ బిడ్డలకు మంచి జ్ఞాన బోధ అందించడంతోపాటు, తన కుటుంబానికి ఎంతో తోడ్పాటు నివ్వడమే కాకుండా, సమాజానికి పనికి వచ్చే బిడ్డల్ని తయారు చేస్తుందని ఆమె తెలియజేశారు, కాబట్టి ఓబులం పల్లె పంచాయతీలో ఉండే ప్రజలందరూ కూడా ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ముండ్ల సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ మూగయ్య ,చల్ల వెంకటసుబ్బారెడ్డి, చల్లాశివారెడ్డి, కార్యదర్శి జగదీ శ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు చంద్రబాబు రెడ్డి, బాబు రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, విశ్వనాథరెడ్డి, పవన్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు