గ్రంథాలయాలు.. విజ్ఞానకేంద్రాలు…
1 min read– లిటిల్ ఏంజెల్స్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ యంయఫ్ ఇమ్మానియేల్
పల్లెవెలుగు వెబ్, వెలుగోడు: గ్రంథాలయాలు విజ్ఞాన వికాస కేంద్రాలని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించుకోవాలని సూచించారు లిటిల్ ఏంజెల్స్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ యం యఫ్ ఇమ్మానియేల్. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లొ భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు గ్రంథాలయ అధికారి ఎన్ వి. సుమలత ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు గాడి చర్ల హరి సర్వోత్తమ రావు , అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం , వెలగా వెంకటప్పయ్య , మరియు గ్రంథాలయాల పుస్తకాల వర్గీకరణ యందు పలు సూత్రాలను ప్రపంచానికి తెలియచెప్పిన SR రంగనాథన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడమైనది. ఈ కార్యక్రమమునకు లిటిల్ ఏంజెల్స్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ యం యఫ్ ఇమ్మానియేల్ విద్యార్థినీ విద్యార్థులకు గ్రంథాలయ ఉద్యమకారుల గురించి తెలియజేసి విద్యార్థులను గ్రంథాలయానికి ర్యాలీగా పంపించడమైనది. ఈ కార్యక్రమంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్ టీచర్ అనిల్ గారు మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని ప్రతి ఆదివారం గ్రంథాలయం నందు చదవడం- మాకిష్టం అనే ప్రోగ్రాం కు ప్రతి ఒక్క విద్యార్థి హాజరుకావాలని విద్యార్థులు గ్రంథాలయం నందు సభ్యత్వం తీసుకోవాలని తెలియజేశారు, విద్యార్థులు శ్రీ గాడి చర్ల హరిసర్వోత్తమరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడమైనది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు గ్రంధాలయ పాఠకులు పాల్గొన్నారు.