గ్రంధాలయాలను ప్రజలకు చేరువ చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గడివేముల గ్రంథాలయంలో ఉద్యమంలో పాల్గొన్న మహనీయులను స్మరించుకొనుట కార్యక్రమంను గ్రంథాలయాధికారి వి. వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గడివేముల గ్రామ సర్పంచ్ రవణమ్మ మాట్లాడుతూ గ్రంథాలయాల ద్వారా ప్రజల విజ్ఞానాన్ని పెంపొందించు కోవచ్చు అన్నారు. మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల అవసరాన్ని ఆనాడే గుర్తించిన S.Rరంగనాథన్, పాతూరి నాగభూషణం, గాడి చర్ల హరి సర్వోత్తమరావు ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. గ్రంధాలయాధికారి వి. వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా రేపు గురువారం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు అనంతరం గ్రంధాలయ ఉద్యమకారుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రంథాలయ పాఠకులు, గ్రంధాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.