PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రంథాలయం.. విజ్ఞానగని.. : ఏడి డి.నాగార్జున

1 min read

పల్లెవెలుగువెబ్​, ఏలూరు: గ్రంథాలయాలు విజ్ఞాన గనులని వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు డి. నాగార్జున అన్నారు. సోమవారం 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకొని రెండవ రోజు జిల్లా గ్రంథాలయ సంస్థలో పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీ నాగార్జున మాట్లాడుతూ గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకొని నిరుద్యోగులు జ్ఞానంను సంపాదించుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఒక మంచి పుస్తకం ఎంతో మంది మిత్రులతో సమానం అని, మంచి పుస్తకం దగ్గర అంటే మనకు మంచి మిత్రులు లేరన్న లోటు కనిపించదని అన్నారు. ఒక మంచి పుస్తకాన్ని చదివితే ఒక కొత్త స్నేహితులను సంపాదించుకున్నట్లుఉంటుందన్నారు.ఈ గ్రంధాలయంలో భారత రాజ్యాంగం, జాతీయోద్యమం.జాతీయోద్యమ నాయకులు, జనరల్ నాలెడ్జ్ , పోటీపరీక్షలకు ఉపయోగపడే వివిధ రకాల పుస్తకాలు, పిల్లలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వీటిని వినియోగిచుకోవాలన్నారు.జిల్లా కేంద్ర గ్రంథాలయం లో ఉన్న పుస్తకాలు ఆయన పరిశీలించారు.గ్రంథాలయంలో జరుగుతున్న విద్యార్థుల చదరంగం పోటీలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి.రవి కుమార్,డిప్యూటీ లైబ్రేరియన్ వి.శ్రీనివాసరావు, లైబ్రేరియన్ సందీప్ కుమార్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author