కన్నీళ్లు పెట్టిస్తోన్న ఎల్ఐసీ !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా చరిత్ర సృష్టించిన ఎల్ఐసీ ఇన్వెస్టర్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. వరుసగా 10వ సెషన్ అయిన సోమవారం కూడా ఎల్ఐసీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-అప్ పిరియడ్ ముగిసిపోవడంతో అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో సోమవారం ఎల్ఐసీ షేర్ విలువ 5.6 శాతం మేర నష్టపోయింది. దీంతో లిస్టింగ్‌కు వచ్చిన మే 17 నుంచి ఇప్పటివరకు షేర్ వ్యాల్యూ ఏకంగా 29 శాతం మేర కుంగినట్టయింది. సుమారు రూ.132,753 కోట్లు మేర సొమ్ము తుడిచిపెట్టుకుపోవడంతో ఇన్వెస్టర్లు నష్టాల్లో మునిగారు.