ఎల్ఐసీ రికార్డు లాభాలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్లో భారీ లాభాలను సంపాదించింది. ఏప్రిల్-జూన్ కాలంలో 10 వేల కోట్లకు పైగా లాభాలను బుక్ చేసిందని సమాచారం. ఎల్ఐసి ప్రభుత్వ ఆధీనంలోని ఇన్సూరెన్స్ సంస్థ. 8 ట్రలియన్ డాలర్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడిని చేరుకోవడానికి .. 94 వేల కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేసింది. కరోన రెండో దశ ఉదృతంగా ఉన్న సమయంలో స్టాక్ మార్కెట్లు 6 శాతం దాకా పెరిగాయి. ఇది ఎల్ఐసి భారీ లాభాలను పొందడానికి ఉపయోగపడింది. గత ఏడాది జూన్ లో ఎల్ఐసి 7 వేల కోట్ల లాభాలను బుక్ చేసుకుంది. జూన్ త్రైమాసికంలో పలు కంపెనీల్లో ఎల్ఐసి తన వాటాను తగ్గించుకుంది.