4 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గత నెల 19/10/2023 వ తేదీన కర్నూల్ విజిలెన్సు RVEO నీలం పూజిత ఆదేశాల మేరకు విజిలెన్సు సిబ్బంది మరియు drug inspector తో కలిసి కర్నూల్ పట్టణము GGH ఎదురుగా గల
1) మధుర మెడికల్ షాప్
2) శివ కృప మెడికల్ షాప్
3) శాంతి మెడికల్ షాప్
4) సాయి మమత మెడికల్ షాప్ లను తనిఖీ చేసి పై మందుల షాపులలో ఈ క్రింది అక్రమాలు గుర్తించడమైనది
1) prescription లేకుండా మందులు అమ్మడం
2) బిల్లు ఇవ్వకుండా మందులు అమ్మడం
3) ఫార్మసీస్ట్ లేకుండా మందులు అమ్మడం
4) షెడ్యూల్డ్ prescription registers maintain చేయకుండా మందులు అమ్మడం.
ఈ నాలుగు మందుల షాపుల లైసెన్సులను drug control శాఖ వారు (AD , drug control )ఈ క్రింద తెలిపిన విధంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది.
