విద్యతోనే జీవితం వికసిస్తుంది…
1 min read
సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు
హొళగుంద న్యూస్ నేడు: విద్యతోనే జీవితం వికసిస్తుందని కర్నూల్ సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు విద్యార్థిని విద్యార్థులకు సూచించారు . మంగళవారం స్థానిక అంబేద్కర్ ఎస్ హెచ్ జి, వరలక్ష్మి ఎస్ హెచ్ జి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్స్ ను ఆకస్మికంగా పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకు ప్రభుత్వం ఏ ఒక్క విద్యార్థి విద్య మధ్యలో ఆగిపోకూడదని సదుద్దేశంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది, ప్రతి ఒక్కరు అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్లాలన్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి నాణ్యమైన భోజనాలతోపాటు డీఎడ్ బీఎడ్ ఉపాధ్యాయులచే విద్యను అందిస్తున్నారు అన్నారు. మంచిగా చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి పై ఉందని గుర్తు చేశారు విద్యార్థిని విద్యార్థులకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష సీఎమ్ఓ. శివశంకర్, ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ నాగరాజు సి ఆర్ ఎం టి లు తుకారం, రేణుక అటెండర్ మల్లయ్య సీజనల్ హాస్టల్ ఉపాధ్యాయులు దుర్గయ్య, సోహెబ్ తదితరులు పాల్గొన్నారు.
