PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకి జీవితం.. ఆదర్శనీయం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: వాల్మీకి మహర్షి జీవితం… అందరికీ ఆదర్శనీయమన్నారు సొసైటీ సీఈఓ అశోక్ , వైసీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా సంయుక్త కార్యదర్శి గోవర్ధన్,కేడీసీసీ జిల్లా బ్యాంక్ డైరెక్టర్ రాఘవేంద్ర, జడ్పిటిసి దొరబాబు. బుధవారం వాల్మీకి జయంతిని సందర్భంగా ఆస్పరి గాంధీ పార్క్​లో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ వాల్మీకి తన జీవితంలో చెడు నుంచి మంచిగా ఎలా మార్పు చెందినాడో గుర్తించి,అలాంటి వాల్మీకే శ్రీరాముని జీవితంను రసరమ్యంగా రామాయణం రాయడం జరిగిందని,కావున జీవితంలో ఎన్నో తప్పోప్పులు చేసిన.. చివరికి మంచి జీవితం బతకాలన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి వాల్మీకులకు పెద్దపీఠ వేశారన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు , బ్రెడ్డు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దుమ్మ నరసింహులు, మాజీ సొసైటీ చైర్మన్ కేశవ రెడ్డి, నాయుడు,ప్రకాష్, రంగన్న,పెద్దిరెడ్డి,శివ,శేఖర్ ,తిమ్మప్ప, సుంకన్న, రాజశేఖర్,రాజు, నాగార్జున, శంకర్, నరసప్ప నరసింహ, వాల్మీకులు, వైసిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author