PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ లైఫ్​ ఈస్​ లవ్​’ సక్సెస్​ కావాలి

1 min read

– వెబ్​సిరీస్ ట్రైలర్​ను విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కె.ఎఫ్.సి పిక్చర్స్ బ్యానర్ పై షాషా వలి ఎస్.జి. దర్శకత్వంలో ప్రభాకర్, మీనాక్షి నటీనటులుగా నిర్మించిన ” లైఫ్ ఈస్ లవ్” వెబ్ సిరీస్ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి అన్నారు. ‘ లైఫ్​ ఈస్ లవ్​ ’ వెబ్​ సిరీస్​ ట్రైలర్​ను మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి, ఆయన సతీమణి విజయ మనోహరి బుధవారం వారి స్వగృహంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత లఘుచిత్రాలకు ఆసక్తి చూపుతున్నారని, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కర్నూలులో చలనచిత్ర రంగానికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందన్నారు. దర్శకుడు షాషావలి, టీమ్​ సభ్యులు మంచి కథలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్వీ దంపతులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎడిటర్ & కెమరామెన్ దినేష్ బాబు, మీనాక్షిరెడ్డి, ప్రభాకర్, సతీష్, మల్లికార్జున, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author