PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాలుగు గేట్లు ఎత్తివేత…

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గోనెగండ్ల: గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్ల లోనీ గాజులదిన్నె ప్రాజెక్ట్ (సంజీవయ్య సాగర్ )కు గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో పాటు బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మరింత వరద నీటి ఉధృతి పెరిగి ప్రమాద స్థాయికి నీరు చేరడంతో ప్రాజెక్ట్ అధికారులు,మండల అధికారులు అప్రమత్తమై హుటాహుటిన జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించి బుధవారం మధ్యరాత్రి రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే గురువారం ఉదయం ప్రాజెక్టులో నీటి ఉధృతి పెరగడంతో మరో రెండు క్రస్ట్ గేట్లు 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ విషయంపై డి ఈఈ విజయ్ కుమార్ ను పాత్రికేయులు వివరణ కోరగా ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు సంజీవయ్య సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 25వేల క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. అలాగే గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండడంతో 32000 క్యూసెక్కుల నీరు విడుదల చేశామన్నారు. అనంతరం మండల తహసిల్దార్ వేణుగోపాల్ ప్రాజెక్టు డి ఈ ఈ విజయ కుమార్ తో కలిసి ప్రాజెక్టును సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రాజెక్టు లోకి అధిక నీరు ఏ క్షణంలోనైనా రావచ్చని సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రాజెక్టుకు దిగువనున్న హంద్రీనీవా పరివాహక ప్రాంతాలైన గ్రామాలలో దండోరా ద్వారా, దేవాలయాల్లోని మైకుల ద్వారా సమాచారం అందించే విధంగా కృషి చేయాలని అన్నారు. మండలంలోని అగ్రహారం ,బైలుప్పల , గంజిల్ల పరిధిలోని మల్లెల వాగు వంక , అలువాల వంక , పెద్ద మర్రివీడు వంక లలో వరద నీరు ఉద్రిక్తంగా పారుతున్నాయి . ప్రాజెక్టు ట్రస్ట్ గేట్లు ఎత్తడంతో సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు .ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చిన ప్రజలను ఎస్సై మోహన్ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షించారు. ప్రాజెక్టు అధికారులు ఏఈఈ లు ఆలీ, పరమేష్, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉగ్ర నరసింహ, మక్బ్ ల్,ఎల్లప్ప ,రంగడు తదితరులు ఉన్నారు.

About Author