NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తో ఎందరో జీవితాల్లో వెలుగులు

1 min read

పల్లెవెలుగు వెబ్ అమరావతి:  నారా చంద్రబాబు నాయుడుపై పడిన అపనిందను (?) తొలగించేందుకు, నా ఇద్దరు కుమార్తెలు పొందిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెట్టిన ఖర్చును మేము కడతాము. బి.టెక్ చదివేటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పొందిన నా పెద్ద కుమార్తె మరియు ఇతర విద్యార్థినులు, ట్రైనింగ్ పూర్తయ్యాక 2017 ఏప్రిల్ నెలలో అమరావతికి వెళ్లి ఆనాటి మంత్రి  శ్రీ కొల్లు రవీంద్రని మరియు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఫోటోను చూడండి. నా చిన్న కుమార్తె కూడా బిబిఏ చదివేటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ 370 కోట్ల నుండే నా ఇద్దరు కుమార్తెలు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సొమ్మును శ్రీ నారా చంద్రబాబు నాయుడు  దోచుకుని ఉంటే నా కుమార్తెలకు ట్రైనింగ్ ను ఎవరి డబ్బుతో ఇచ్చారు? కావాలంటే నా కుమార్తెల ట్రైనింగ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అయిన ఖర్చు ఎంతో చెబితే నేను తిరిగి కడతాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు  దోచుకున్నారంటున్న మొత్తం నుండి నేను కట్టే సొమ్మును మినహాయించండి. నా కుమార్తెల లాంటి వారికి ట్రైనింగ్ ఇప్పించి, ఎంతో మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయి మంచి జీతాలతో ఉద్యోగాలు చేయగలిగే పరిస్థితి కల్పించిన ఆ మహానుభావుడికి, నా కుమార్తెల లాంటి వారి భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టిన సొమ్మును దోచుకున్నాడనే మచ్చ రావడం నాకు, నా కుమార్తెలకు, నా భార్యకు చాలా బాధను కలిగిస్తోంది. ఇట్లు అబ్బూరి శ్రీనివాసులు 6304371012

About Author