PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా పై ఉక్రెయిన్ మెరుపు దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రష్యా నగరంలోని బెల్గోరోడ్‌ పేలుళ్లతో దద్దరిల్లింది.. వరుస దాడులతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది..! ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. 11 అపార్ట్‌మెంట్లు, 39 నివాస గృహాలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన రహస్య దళం ‘‘షామన్‌’’ బెటాలియన్‌ చేస్తున్న ఆపరేషన్ ఇది. సుశిక్షిత షామన్‌ కమాండోలు.. అత్యంత చాకచక్యంగా శత్రువు భూభాగంలోకి ప్రవేశించి తమ మిషన్‌ పూర్తి చేస్తున్నారు. కఠోర శిక్షణ పొందిన షామన్‌ బెటాలియన్‌కు ఉక్రెయిన్‌ ఈ బాధ్యత అప్పగించింది. తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్ల ద్వారా వీరిని నిర్దేశిత ప్రాంతాలకు ఉక్రెయిన్‌ చేరవేస్తోంది. అక్కడ వెంటనే వీరు తమ మిషన్‌లోకి దిగిపోతారు. అయితే, దీనిని రష్యా ఆలస్యంగా పసిగట్టింది. ఆదివారం దాడుల అనంతరం తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను మరింత అప్రమత్తం చేసింది.

                                     

About Author