NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌ర్న‌లిస్టుల‌కు ఝ‌ల‌క్ !

1 min read

Female reporter at press conference, writing notes, holding microphone

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. జ‌ర్న‌లిస్టుల‌ పిల్లలకు పాఠశాలల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులను జగన్‌ సర్కారు తాజాగా నిలిపేసింది. పాత్రికేయుల పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ అప్పట్లో ప్రతి జిల్లాలోనూ జిల్లా విద్యాశాఖాధికారులు ఉత్తర్వులిచ్చారు. కొన్ని చోట్ల ఇది అమలుకావడం లేదని జిల్లాల్లో పాత్రికేయ సంఘాలు డీఈవోలకు వినతిపత్రాలు ఇచ్చాయి. సదరు డీఈవోలు ఈ అంశాన్ని పాఠశాల విద్య డైరక్టర్‌కు నివే దించారు. అక్కడ ఉత్తర్వుల అమలు కోసం ఆదేశాలివ్వకపోగా.. అసలు వాటిని అమలే చేయొద్దని నిర్దేశించార‌ని జ‌ర్న‌లిస్టులు ఆరోపిస్తున్నారు.

                                     
     

About Author