NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏక‌గ్రీవాలైన‌ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల‌కు లైన్ క్లియ‌ర్

1 min read

అమ‌రావ‌తి వెబ్​: ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల ఏక‌గ్రీవాల‌కు సంబంధించిన కేసులో హైకోర్టు మంగ‌ళ‌వారం కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించింది. బ‌ల‌వంత‌పు అడ్డగింత‌, నామినేష‌న్ ఉపసంహ‌ర‌ణ‌కు సంబంధించిన కేసులో ఎన్ఈసీ ఆదేశాలను కోర్టు ర‌ద్దు చేసింది. గ‌తంలో ఏక‌గ్రీవాల మీద పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు రావ‌డంతో.. ఎన్ఈసీ విచార‌ణ‌కు ఆదేశించింది. అయితే.. ఈ విచార‌ణ మీద పిటిష‌న‌ర్ కోర్టుకు వెళ్లారు. గ‌తంలో ఎన్ఈసీ ఆదేశాల మీద మ‌ధ్యంత‌ర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు మంగ‌ళ‌వారం తుది తీర్పు వెలువ‌రించింది. గ‌త ఏడాది నిలిచి పోయిన జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఫారం-10 ఇచ్చిన ఏక‌గ్రీవాల మీద ఎన్ఈసీ కి విచార‌ణాధికారం లేద‌న్న పిటిష‌న‌ర్ వాద‌న‌తో కోర్టు ఏకీభ‌వించింది. ఎన్ ఈసీ ఆదేశాల‌ను కొట్టివేస్తూ.. గ‌తంలో ఏకగ్రీవాలైన చోట డిక్లరేష‌న్ ఇవ్వాల‌ని ఎన్ఈసీ కి స్పష్టం చేసింది.

About Author