ఇంటి నంబర్ కు ఆధార్ లింక్ చేసుకోండి
1 min read
న్యూస్ నేడు , హొళగుంద: హొళగుంద మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంటియజమానులు తమ ఇంటి నంబర్లకు ఆధార్ నంబరు లింక్ చేసుకోవాలని పంచాయతీ సెక్రటరి రాజశేఖర్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పంచాయతీ రికార్డులో ఇంటి యజమానుల పేర్లు మీద నమోదైన నంబర్లకు ఆన్లైన్లో ఆధార్ నంబరు లింక్ చేసే ప్రక్రియ సోమవారం వరకు ఉంటుందని అంతలోపు ఇంటి యజమానులు పంచాయతీ కార్యాలయానికి వచ్చి లింక్ చెయించుకోవాలని సూచించారు.