‘ఆధార్– ఓటరు’ అనుసంధానం.. త్వరగా చేయండి
1 min readకలెక్టర్ పి.కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానం ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇఆర్ఓ లను, ఎఇఆర్ఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇఆర్ఓ లు, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు..సమీక్ష సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో 2184 పోలింగ్ స్టేషన్లు ఉండగా 19 లక్షల 89 వేల 44 (1989044) మంది ఓటర్లు ఉన్నారని ఇప్పటివరకు ఫామ్ 6 బి కి సంబంధించిన ప్రక్రియ 3 లక్షల 72 వేల 193 మందికి పూర్తి అవ్వగా, 16 లక్షల 16 వేల 851 మంది ఫామ్ 6 బి కలెక్షన్ పెండింగ్ లో ఉన్నాయన్నారు…. ప్రతి రోజు BLO లు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డు ఓటరు కార్డు అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని AERO లను ఆదేశించారు.. ఒకవేళ ఓటరు ఆధార్ కార్డును అందించలేకపోతే, నిర్దేశించిన పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని ఓటరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని AERO లను ఆదేశించారు. ప్రతి రోజు ప్రోగ్రెస్ ఉండే విధంగా కష్టపడి పని చేయాలని, నిర్దేశిత గడువు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. బూత్ లెవెల్ అధికారులకు లక్ష్యాలు విధించి పనులలో పురోగతి తీసుకొచ్చే విధంగా AERO లు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా ERO లు నియోజకవర్గ, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ లెవెల్ అధికారులు ఫామ్ 6 బి ఆధార్ కార్డు ఓటరు కార్డు అనుసంధానం కి వెళ్ళినప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2023 షెడ్యూల్ కి సంబంధించిన పనులను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మ్యుటేషన్ లు, అజ్మాయిష్, కోర్ట్ కేసులు, భూసేకరణ, స్పందన, రీ సర్వే తదితర రెవెన్యూ అంశాలపై మండల వారీగా సమీక్షించారు… హౌస్ సైట్స్ కి సంబంధించిన పనులలో EKYC పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని. మంగళవారం నాటికి హౌసింగ్ EKYC పనులు 100 శాతం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రీ సర్వే కి సంబంధించి 22 ఎ1 లిస్ట్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిజిష్టర్ పనులు పెండింగ్ లో ఉన్నాయని వచ్చే వారం లోగా 22 ఎ1 లిస్ట్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిజిష్టర్ పనులు ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు .డాటెడ్ లాండ్స్ , 22a నిషేధిత భూములు లో ఉన్న అన్ని పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు ఫేర్ ప్రైస్ షాప్స్ తనిఖీ చేసి బియ్యం పంపిణీ సక్రమంగా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు .వాటర్ బాడీస్ ఆక్రమణకు గురైనట్లయితే గుర్తించి వెంటనే నివేదిక పంపించాలన్నారు. సమావేశంలో ఇంఛార్జి డిఆర్వో మల్లికార్జునుడు, ఆర్డీవోలు హరి ప్రసాద్, రామకృష్ణా రెడ్డి, మోహన్ దాస్, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, డ్వామా పీడీ అమర్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.