PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ లయన్స్​ క్లబ్​’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం..

1 min read

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య జిల్లా (రాయచోటి): సమాజసేవే లయన్స్ క్లబ్ లక్ష్యం  స్థానిక సాయి శుభ కళ్యాణ మండపంలో ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ బాయారెడ్డి గారు మాట్లాడుతూ  లయన్స్ క్లబ్స్ ఆఫ్ రాయచోటి టౌన్ సేవా కార్యక్రమాలలో చక్కగా రాణిస్తుందని కడప జిల్లాలో  ప్రథమ  స్థానంలో నిలిచినందుకు అభినందిస్తున్నానని తెలిపారు అనంతరం మరొక ముఖ్య అతిధి  డాక్టర్ కే సంగమ్మ గారు మాట్లాడుతూ లయన్ మెల్విన్ జోన్స్ స్థాపించినటువంటి లయన్స్ క్లబ్ weserve అనే నినాదంతో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతుందని మనము కూడా మనకు తోచినంత ఎంతోకొంత సేవ చేయాల్సిన అవసరం ఉందని ఎక్కడైతే మన సేవ అవసరం ఉంటుందో అక్కడ సేవ చేయాల్సిన అవసరం ఉందని లయన్స్ క్లబ్ సభ్యులకు తెలిపారు అనంతరం లయన్ పి ఎస్ హరినాథ్ రెడ్డి మరియు లయన్ యం అశోక్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ గత 4 సంవత్సరాలలో జిల్లా లో సేవలకు మారుపేరుగా నిలిచిందని అలాగే రాబోయే రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కొత్త కార్యవర్గాన్ని సూచించారు అనంతరం ప్రమాణ స్వీకారానికి ఇన్సులేషన్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి రాజంపేట లయన్స్ క్లబ్ కు చెందినటువంటి పాస్ట్ రీజనల్ చైర్మన్ లయన్ పి రమేష్ నాయుడు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్బు నూతన అధ్యక్షులుగా లయన్ షేక్ మహమ్మద్ కార్యదర్శిగా లయన్ షేక్ ఇందాద్ అహమ్మద్  కోశాధికారిగా లయన్ సి రత్నమాచారి గా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా లయన్ పి శివారెడ్డి సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా లయన్ వి హారిష్ చంద్ర జాయింట్ సెక్రటరీగా లయన్ జి కిషోర్ కుమార్ రెడ్డి క్లబ్ మెంబర్షిప్ చైర్మన్గా లయన్ m ప్రభాకర్ నాయుడు లయన్ trimer గా లయన్ ఏ జంగం రెడ్డి లయన్  twister గా లయన్ టి రంగారెడ్డిలు ప్రమాణస్వీకారం చేశారు అంతేకాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా లయన్ యం అశోక్ రెడ్డి లయన్  సుబ్బారెడ్డి లయన్ పి కుసుమాకర్ లయన్ డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి లయన్ వి నారాయణరెడ్డి లయన్ పిఎస్ హరినాధ రెడ్డి లయన్ ఎస్ నాగార్జున చారి  డాక్టర్ రెడ్డి కీర్తి లు ఎన్నిక కాబడ్డారు అలాగే అడ్వైజరీ కమిటీగా లయన్ డాక్టర్ నిసార్ అహ్మద్ లయన్ ఎం శివమల్ రెడ్డి   లయన్ గ్రందే రాధ కృష్ణ లయన్ డాక్టర్ సునీల్ కుమార్ నాయక్  లయన్ ఎస్ రామాంజనేయులు లయన్ ఎం రెడ్డప్పారెడ్డి లయన్ యం నరసింహారెడ్డి లయన్ వెంకట్రామిరెడ్డి లయన్ కె సుందర్ రాజు నాయుడును ఎంపిక చేశారు అనంతరం పాస్ట్ రీజియన్ సెక్రటరీ అయినటువంటి లయన్ డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డిచే నూతన సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని చేయడం జరిగింది అనంతరం 2021-2022 వ సంవత్సారము  అధ్యక్షులు గ చేసిన లయన్ షేక్ చాన్ బాషా మాట్లాడుతూ గత సంవత్సరము నేను అధ్యక్షులుగా ఉన్నప్పుడు నాకు సహకరించిన ప్రతి ఒక్క లయన్ మెంబర్ కు లయన్ పెద్దలకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే రోజులలో కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ కు మంచి గుర్తింపు తెస్తానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ లయన్ షేక్ అబ్దుల్లా జోన్ చైర్మన్ లయన్ పి సుమాకర్ పాస్టర్ రీజియన్ చైర్మన్ ఎం అశోక్ రెడ్డి నరసింహ ఆచారి సాయి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి లివింగ్ డయాగ్నొస్టిక్ అధినేత వివేకానందారెడ్డి ఎస్సై మొహమ్మద్ రఫీ మనం అధినేత వై వి ఎస్ ప్రకాష్  సభ్యులు పాల్గొన్నారు. కార్యదర్శి లయన్ షేక్ ఇందాద్ అహ్మద్ మాట్లాడుతూ 2021-22 సంవత్సరానికి మొత్తం 157 క్యాంపులు దాతల సహకారంతో చేయడం జరిగిందని అలాగే ఈ సంవత్సరము నాకు మరల కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ క్యాంపులు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం లయన్ డాక్టర్ ఎం జె ఎఫ్ శ్యాంసుందర్ రెడ్డి కొత్తగా చేరిన 20 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

About Author