లయన్స్ కంటి ఆస్పత్రిలో.. 41 మందికి ఆపరేషన్లు
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: రాయచోటి మండల పరిధిలోని చెన్నముక్కపల్లె గ్రామంలో గల లయన్స్ కంటి ఆస్పత్రిలో ఆదివారం జరిగిన కంటి వైద్య శిబిరంలో 41 మంది రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు.ఈ సందర్భంగా రాయచోటి మేజర్ గన్ తో పాటు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట,కోడూరు కె.వి పల్లి, యర్రావారిపాలెం, కలకడ, కలికిరి, పెద్దమండ్యం, గుర్రంకొండ, కదిరి, ఎన్.పి.కుంట,చక్రాయపేట తదితర ప్రాంతాల నుండి వచ్చిన 90 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు అందులో అర్హులైన 41 మంది రోగులకు ఆపరేషన్లు చేపట్టారు. అలాగే గతంలో ఆపరేషన్ చేయించుకున్న 50 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు,మందులు పంపిణీ చేశారు.అలాగే కంటి రోగులతో పాటు వారి వెంట ఉండే సహాయకుల సౌకర్యార్థం భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో కంటి ఆసుపత్రి చైర్మన్ వై.వి.స్వరూప గుప్త, మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష, ఏపీఐఐసీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి,ఎంపీటీసీ రామచంద్రారెడ్డి,కంటి వైద్యులు సురేష్ బాబు, మహాలక్ష్మి,శశిబిందు,భార్గవి,ఆప్త మాలిక్ అసిస్టెంట్ రాజగోపాల్ రెడ్డి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.